ఆపదలో ఆపన్నహస్తం - చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ
- DORA SWAMY

- May 8, 2022
- 1 min read
ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ - కాలు పోగొట్టుకున్న జనార్ధన కు ఆర్థిక సాయం - ధాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి.

ప్రస్తుత జీవన కాలంలో తమ వ్యక్తిగత కుటుంబ అవసరాలతో బిజీ బిజీగా ఉన్న జనజీవన మధ్య ఎవరైనా ఆపదలో ఉన్నారని... అది వైద్య, విద్య, అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరం, పర్యావరణ సంరక్షణ తదితర కార్యక్రమాలను బాధ్యతాయుతంగా చేపడుతూ, విపత్తు సమయాలలో నిరుపేదలకు నిత్యావసరాలను అందజేసి బాధితులకు మేమున్నాము అన్న భరోసా ఇస్తూ "చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (CHS) "సంస్థ చేతనయిన సహాయాన్ని అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం లా ఆదుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళుతూ ఉంది. వీరు చేస్తున్న సామజిక సేవలు అమోఘమని చెప్పుకోవాలి.

ఇదే క్రమంలో ఇటీవల బైక్ ప్రమాదంలో కాలు పూర్తిగా కోల్పోయిన తిమ్మాయపాలెం యానాదికాలని వాసి నిరుపేద తుమ్మూరు జనార్ధన విషయం తెలుసుకున్న CHS బాధితులు వెంటనే తమ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 30,000 రూ.లు అందచేశారు. ఇంకా మరి కొందరు సహాయం అందించడంలో ఈ సంస్థ సభ్యులు చొరవ చూపారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి గాడి.ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు , ఏదైనా అవసరం ఉంది అన్న విషయం పోస్ట్ చేసిన వెంటనే ..ఎంతో సానుకలంగా స్పందిస్తున్న దయార్ద్ర హృదయం గల తమ సంస్థ సభ్యులకు మరియు ధాతలకు తమ సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ "మానవసేవే మాధవ సేవ" అని ఆపదలో ఉన్నపుడు సాటి మనిషికి తోడ్పడపడటమే నిజమైన మానవత్వం అని , నిస్వార్థ సేవలందించడమే తమ కర్తవ్యమని , తమ సంస్థ లక్ష్యం కల్మష రహిత అభివృద్ధి అని హితవు పలికారు.సమాజ సేవ చేయాలనీ ఉత్సాహంగా ఉన్న యువతకు , దాతలకు తమ సంస్థ ఆహ్వానం పలుకుతుందని తెలిపుతూ..బాధితునికి ప్రతి ఒక్కరూ తమ సహాయాన్ని అందించి అండగా నిలవాలని; దాతలు ఎవరైనా సహాయాన్ని అందించాలంటే ఫోన్ పే నెంబర్ 91770 96545(నాగిరెడ్డి. కృష్ణారెడ్డి)కి నగదును పంపించవచ్చునని చిట్వేల్ హెల్ప్ లైన్ సంస్థ సభ్యులు విజ్ఞప్తి చేశారు.



Comments