హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహణ
- VOICE OF HERALD

- 2 days ago
- 1 min read
హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహణ


ప్రొద్దుటూరు: భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు వంకదార నరేంద్ర రావు ఆధ్వర్యంలో వైఎంఆర్ కాలనీలోని బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి 4వ వార్డులో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. వై.ఎం.ఆర్ కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన యాత్ర 4వ వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి, సుమారు 100 కుటుంబాలకు జాతీయ జెండాలను అందజేశారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. జాతీయ జెండాలను స్వీకరించిన కుటుంబాల వారు తప్పకుండా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. దేశభక్తి భావాన్ని ప్రతి కుటుంబంలో పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని బీజేపీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అంకిరెడ్డి చిరంజీవి రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వెంకట్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఎం. కుమారి, ప్రధాన కార్యదర్శులు చెన్నా మోహన్, ముత్యాల శ్రీ, ఉపాధ్యక్షురాలు బొలిశెట్టి రెడ్డి ప్రసన్న, రవి ప్రకాష్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు చౌడయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు అఖిల, బీజేవైఎం కార్యదర్శి శ్రీను, బీజేవైఎం అధ్యక్షుడు చరణ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా – ప్రతి హృదయంలో దేశభక్తి అనే సందేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.



Comments