top of page

ప్రొద్దుటూరు అభివృద్ధికి ‘హామ్’ నిధులు: త్వరలోనే రూ.40 కోట్లతో పనులు ప్రారంభం – ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 22
1 min read

ప్రొద్దుటూరు అభివృద్ధికి ‘హామ్’ నిధులు: త్వరలోనే రూ.40 కోట్లతో పనులు ప్రారంభం – ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) కింద ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.40 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే రూ.316 కోట్లు సమకూరాయని, గత 25 ఏళ్ల కాలంలో పట్టణానికి ఇంత భారీ ఎత్తున నిధులు రావడం ఇదే ప్రథమమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

తాజాగా మంజూరైన రూ.40 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు త్వరలోనే అంచనాలు రూపొందించి, టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో రోడ్ల విస్తరణ, కీలక మౌలిక వసతుల కల్పనకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఒకవైపు 'సూపర్ సిక్స్' పథకాల ద్వారా సంక్షేమాన్ని, మరోవైపు మౌలిక ప్రగతిని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని వివరించారు. పట్టణ ప్రగతి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ బృందానికి ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page