top of page

ఐ.టి.డి.పి యాప్ కు ఓటర్ లిస్ట్ కు ఏమిటి సంబంధం - జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 17
  • 1 min read

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, ప్రత్యరోపణలతో ప్రొద్దుటూరు రాజకీయ ముఖచిత్రం వేడెక్కింది, తాజాగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై టిడిపి మాజీ ఇంచార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు స్థానిక వై.యమ్.ఆర్ కాలనీలోని ఆయన కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పత్రికల సమావేశంలో ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పై రాచమల్లు డిబేట్కు రాగలరా అని సవాల్ విసిరారు. ఐ టి డి పి కేవలం తమ పార్టీకి చెందిన సామాజిక మాధ్యమమేనని, ఓటర్ లిస్టుకు ఐటీడీపీ ఆప్ కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఇకనైనా ఆరోపణలు పక్కనపెట్టి వ్యాపార వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరు అభివృద్ధి పథంలో నడిపించేలా మాజీ ఎమ్మెల్యే కూడా సహకరించాలని కోరారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ స్కామ్ లో స్టీల్ వ్యవహారం పై ప్రజలకు ఇప్పటికే పూర్తి అవగాహన వచ్చిందని, ఆరోపణలు ఉంటే తనకు తానే సిబిఐ ఎంక్వైరీ కోరుకున్న రాచమల్లు, మరి మహర్షి స్కూల్ అలాగే బీఎండబ్ల్యూ కాలేజ్ వ్యవహారాలపై ఏమంటారు అని ప్రశ్నించారు?


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page