top of page

సామాన్య కార్యకర్త స్థాయి నుండీ జిల్లా స్థాయి కి ఎదిగిన గుణ యాదవ్

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 16, 2023
  • 1 min read

సామాన్య కార్యకర్త స్థాయి నుండీ జిల్లా స్థాయి కి ఎదిగిన గుణ యాదవ్

గుణ యాదవ్ ఫైల్ ఫొటో

నందలూరు మండలం నకు చెందిన గుణ యాదవ్ వైఎస్ఆర్సిపి జిల్లా బిసి ప్రధాన కార్యదర్శిగా పార్టీ నుంచి ఉత్తర్వులు అందడంతో మండలంలోని తోటి మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. 2012 నుండి మండల స్థాయి కార్యకర్తగా మొదలైన తన ప్రయాణం 2015లో మండల ఉపాధ్యక్షుడుగా, 2016లో అఖిల భారత యాదవ మహాసభ రాజంపేట యువత అద్యక్షడిగా , 2019లో రాజంపేట యువజన విభాగం అధ్యక్షుడు గా , 2021 అఖిల భారత యాదవ మహాసభ రాజంపేట ఉపాధ్యక్షుడు గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కాకుండా ,అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చిన్న పెద్ద అంటూ తారతమ్యం లేకుండా గౌరవ మర్యాదలతో ముందుకు వెళ్తూ నాయకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని, యువ శక్తి సేవా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అతనికున్న ప్రత్యేక గుర్తింపు. నేడు వైఎస్ఆర్సిపి జిల్లా బిసి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినందుకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page