top of page

గూడూరు లో మైనర్ బాలికను ప్రేమించమని యువకుడి వేధింపులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 1, 2022
  • 1 min read

నెల్లూరు జిల్లా, గూడూరు రెండవ పట్టణ పరిధి లోని బిసి కాలనీకి చెందిన ఒక విద్యార్థిని 10వ తరగతి చదువుతూ ఉండగా ఆమె ఇంటికి పక్క ఇంట్లో నివాసం వుండే ఏసు అనే యువకుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను అంటూ అమ్మాయి వెంట పడుతున్నట్టు ఇతను గతంలో బెంగుళూరు నగరంలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేసి ప్రస్తుతం గూడూరు లోనే వస్త్ర దుకాణం లో పనిచేస్తున్నట్టు ఇతను ఈ రోజు స్కూల్ కి పరీక్షలు రాసేధాని కోసం వెళుతున్న మైనర్ బాలికను స్కూల్ దగ్గర అటకాయించి చెంప మీద కొట్టడంతో అవమానంగా భావించిన సదరు మైనర్ బాలిక ఇంటికి వెళ్ళి చేతి మీద ఘాయ పరుచుకున్నట్టు,తర్వాత ఏసు మీద గూడూరు రెండవ పట్టణ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన SI తిరుపతయ్య,గూడూరు పట్టణ CI నాగేశ్వరమ్మ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసి గంటల వ్యవధిలోనే నిందితుడు ఏసు ను అదుపులోకి తీసుకుని మైనర్ బాలికను వేధించినందుకు వివిధ సెక్షన్లకింద (ఫోక్సో చట్టం కింద) కేసు నమోదు చేసినట్టు సమాచారం.

పోలీసు సేవలు వినియోగించుకోండి...గూడూరు పట్టణ CI నాగేశ్వరమ్మ - అమ్మాయిలును వేధించినా, బ్లాక్ మెయిల్ చేసినా వెంట పడినా ఆలస్యం చేయకుండా వెంటనే దిశ యాప్ ద్వారా పొలిసుల సహాయం తీసుకోండి,లేదంటే

దగ్గర్లోని పోలీసు స్టేషన్ కు సమాచారం అందించండి,100 కి డైల్ చేయండి,పోలీసులు 24×7 అందుబాటులో ఉంటారు, సమయం వృధా చేయకుండా ప్రమాదం జరిగే అవకాశం ఇవ్వకుండా పోలీసుల ద్వారా రక్షణ పొందాలని,అలాగే పిల్లలు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వారు ఏమిచేస్తున్నారు అనే విషయం గమనిస్తూ ఉండాలని గూడూరు పట్టణ CI నాగేశ్వరమ్మ పట్టణ ప్రజలకు తెలియ చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page