top of page

కూలీలుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు

  • Writer: EDITOR
    EDITOR
  • May 10, 2023
  • 1 min read

కూలీలుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు

పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో హడావిడి చేసిన అధికారులు


ప్రభుత్వ ఉద్యోగులు కూలీలుగా మారారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 10వ తారీఖున పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పి. గన్నవరం మండలం రాజుల పాలెంలో రైతులతో చర్చించనున్నారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో అధికారులు హడావిడి చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నారు. అటు గ్రామంలోని మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానిక అధికారులు అవస్థలు పడ్డారు.

ప్రభుత్వ అధికారులు కూలీలుగా మారి పంటను సంచుల్లోకి ఎగుమతి చేశారు. అర్ధరాత్రి 11 గంటలకు మార్క్ ఫెడ్ అధికారుల చేత పంటను కొనుగోలు చేయించారని స్థానికులు తెలిపారు. సచివాలయ సిబ్బంది, వీఆర్వోలు తదితర అధికారులు కూలీలుగా మారడంతో సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ వస్తున్నారనే భయంతో అధికారులు హడావిడి చేస్తున్నారని జనసైనికులు విమర్శిస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page