top of page

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ప్రభుత్వ లక్ష్యం - సర్పంచ్ కొనిరెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 7, 2024
  • 1 min read

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ప్రభుత్వ లక్ష్యం - సర్పంచ్ కొనిరెడ్డి

అర్హులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్న సర్పంచ్ కొనిరెడ్డి

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని మండల తహసీల్దార్‌ విద్యాసాగర్‌ పేర్కొన్నారు. బుధవారం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని సచివాలయంలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి వారు పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియలా కొనసాగుతుందన్నారు. సర్పంచ్‌ శివచంద్రారెడ్డి మాట్లాడుతూ, కొత్తపల్లె పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీలో కొన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. ఇంకా అర్హులై ఉండి ఇళ్ల స్థలాలు దక్కని వారు ఉంటే వారందరూ దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనేదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు, పంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page