top of page

కేంద్ర నిధులతో రాష్ట్ర సోకులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 27, 2024
  • 1 min read

నిధులు కేంద్రానివి సోకులు రాష్ట్రానివి

మాట్లాడుతున్న బిజెపి కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రంలో అభివృద్ధి చేశాం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు, ఉచిత పబ్లిసిటీ చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, కేంద్ర నిధులతో నిర్మించిన అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ లకు వైసిపి జెండా రంగులు అద్దటం ఏమిటని ప్రొద్దుటూరు బిజెపి కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు ప్రశ్నించారు? ప్రొద్దుటూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దగల అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ను శనివారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని తమ బిజెపి ప్రభుత్వం నిధులతో అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్మించారని అందులోని ఉద్యోగులకు కూడా జీతభత్యాలు కేంద్ర ప్రభుత్వమే సెంట్రల్ ఫండ్స్ ద్వారా విడుదల చేస్తోందని, అయితే వీటికి డాక్టర్ వైయస్సార్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లుగా వైసిపి ప్రభుత్వం నామకరణం చేసిందని, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ లకు వైసిపి జెండా రంగు పులమటం, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టటం సబబు కాదని ఆయన హెచ్చరించారు. అనంతరం అక్కడి నుండే చెరవాణి ద్వారా ప్రొద్దుటూరు టౌన్ ప్లానింగ్ అధికారికి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. రానున్న ఎన్నికలలో వైసిపి పార్టీని ఎండగడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page