top of page

ఓటమిపై వైసీపీ నాయకులు బెరీజువేసుకోవాలి - గొర్రె శ్రీనివాసులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 20, 2023
  • 1 min read

ఓటమిపై వైసీపీ నాయకులు బెరీజువేసుకోవాలి

- గొర్రె శ్రీనివాసులు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం లో వేడి పెరిగి ఫ్యాన్ ఎంత స్పీడుగా తిరిగినా వైసీపీ హవా లేదని ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ వార్డ్ మెంబర్ల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టం అయ్యిందని, వేలకు వేలు వెచ్చించి ఓట్లు కొన్నా వైసీపీ ఇక్కడ గెలవలేదని, ఇప్పటికైనా వైసీపీ నాయకులు చేసిన తప్పును తెలుసుకొంటె మనుగడ ఉంటుందని ప్రొద్దుటూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు అన్నారు. ఎమ్మెల్యే ఓటమిపై నోరు మెదపకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కొత్తపల్లి పంచాయతీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన ఇరువురు వైసీపీ నాయకులే అని, ఎన్నికల సుజావుగా జరగడానికి సహకరించిన పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, బిజెపి నాయకులు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page