స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి - బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
- EDITOR

- 5 days ago
- 1 min read
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి - బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నందు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కచ్చితంగా విజయం సాధించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొన్నారని ప్రశంసించిన ఆయన, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కూటమి ఒప్పందంలో భాగంగా బీజేపీకి లభించే స్థానాల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు తమ పేర్లు, వార్డు వివరాలను వెంటనే అందించాలని సూచించారు. ఆ వివరాలను పార్టీ పరిశీలకులకు పంపించి కూటమి నాయకులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.



Comments