చెకుముకి సైన్స్ సంబరాల్లో గౌతమ్ పాఠశాల విద్యార్థుల ఘన విజయం: రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

చెకుముకి సైన్స్ సంబరాల్లో గౌతమ్ పాఠశాల విద్యార్థుల ఘన విజయం: రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

కడప పట్టణంలో ఆదివారం (27.09.2026) జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సెలబ్రేషన్స్‌లో స్థానిక గౌతమ్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో విశేష ప్రతిభ కనబరచిన 10వ తరగతి విద్యార్థిని కె. హర్షిణి శ్రీ, 9వ తరగతి విద్యార్థిని వి. నేహా, మరియు 8వ తరగతి విద్యార్థి ఎ. సతీష్ రెడ్డి తమ సత్తా చాటి పాఠశాల కీర్తిని జిల్లా స్థాయిలో సగర్వంగా నిలబెట్టారు. మొదటి స్థానంలో నిలిచిన ఈ ముగ్గురు ప్రతిభావంతులు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.

పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను, వారిని నిరంతరం ప్రోత్సహిస్తూ అంకితభావంతో తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందాన్ని గౌతమ్ హైస్కూల్ యాజమాన్యం హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాఠశాల తరఫున ప్రాతినిధ్యం వహించనున్న విద్యార్థులకు యాజమాన్యం శుభాకాంక్షలు తెలుపుతూ, వారు రాష్ట్ర స్థాయిలో కూడా విజయదుందుభి మోగించి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించింది.






Comments