top of page

నర్సీపట్నంలో గంజాయి ముఠా కారు బీభత్సం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 25, 2022
  • 1 min read

నర్సీపట్నంలో గంజాయి ముఠా కారు భీభత్సం సృష్టించింది వెనుక పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళుతూ అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ పది నిమిషాల పాటు పట్టణంలోని అబీద్ సెంటర్ నుంచి పెద బొడ్డేపల్లి మదుం వరకు అలజడి రేకిత్తించారు. వివరాలిలా ఉన్నాయి. ఏజెన్సీలోని చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసిన స్మగ్లర్లు కారులో మహారాష్ట్ర తీసుకెళ్లే క్రమంలో నర్సీపట్నం చేరుకున్నారు. తనిఖీలు జరగొచ్చనే కారణంతో వీరు కారును వేగంగా నడుపుతూ వెళ్తున్నారు. దీనిని గమనించిన నర్సీపట్నం ట్రాఫిక్ ఎస్.ఐ దివాకర్ తన బందోబస్తుతో కలిసి కారును వెంబడించారు. పోలీసుల నుంచి బయటపడేందుకు కారును వేగంగా నడిపే క్రమంలో స్థానిక అబీద్ సెంటర్లో వృద్ధురాలికి స్వల్పంగా డాష్ ఇచ్చి, శ్రీకన్య సెంటర్లో ఏర్పాటు చేసిన బారీగేట్లను గుద్దుకుని, పెదబొడ్డపల్లి వైపు అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ వెళ్లారు. ముందు స్మగ్లర్లు, వారి వెంబడిస్తూ పోలీసులు ఒకదాని వెనుక మరొకటి వెళుతూ సినిమాలో చేజింగ్ సీన్ ను తలపించారు. పోలీసులు కారును వెంబడిస్తుండటంతో పట్టుబడక తప్పదని గ్రహించిన స్మగ్లర్లు కారును వదిలి బొడ్డపల్లి వంతెన కింద కాలువలోకి దూకేశారు. అప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున చేరడంతో పాటు పోలీసులు అంతా రావడంతో వారికి ఎటూ కదలకుండా పట్టుకున్నారు. పోలీసులు చేసిన చేజింగ్ ను చూసిన స్థానికులు అభినందిస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page