ఎమ్మెల్యే దృష్టికి గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యలు
- VOICE OF HERALD

- Apr 15, 2022
- 1 min read
పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర వార్త, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దృష్టికి..గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యలు. ఉద్యోగుల జీతాలు పెంచాలి, గంగవరం పోర్టు నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగాల నుండి తొలగించిన 4 నిర్వాసితులకు విధుల్లోకి తీసుకోవాలి. సమస్యలు పరిష్కారం కాకపోతే పోర్ట్ ముందు ఆందోళన చేపడతాం. ప్రాణాలను సైతం లెక్కచేయం.

గంగవరం పోర్టు నిర్వాసితుల ఆందోళన, పెద గంట్యాడ గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 64 వార్డు వైసీపీ ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ఆద్వర్యంలో గంగవరం మత్స్యకారులు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గంగవరం నిర్వాసిత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి వివరిస్తూ గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో సర్వం కోల్పోయిన గంగవరం మత్స్యకారులు ఈ రోజు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగారాల నిర్మాణ సమయంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందని అన్నారు. బయట నుండి వచ్చే వారికి జీ పీ ఎల్ అంటూ ఉద్యోగాలు ఇస్తూ అధిక జీతాలు ఇస్తున్నారని, సర్వం కోల్పోయిన గంగవరం పోర్ట్ నిర్వాసితులు మాత్రం చాలీచాలని జీతాలతో సరిపెడుతున్నరని అన్నారు. కార్మిక సమస్యలపై ప్రశ్నించిన వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారని, ఇటీవల నలుగురు గంగవరం పోర్టు నిర్వాసితులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగవరం మత్స్యకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే పోర్ట్ ఆవరణలో ఆందోళన చేపడతామని , పోర్ట్ బిల్డింగ్ ముందు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆత్మ హత్యలకు పాల్పడతామని గంగవరం పోర్టు నిర్వాసితుల వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ సమస్యను ఎంపీ విజయ సాయి రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి, ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకు వెళ్తామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్య క్రమం లో గంగవరం పోర్టు నిర్వాసితులు, 64 వార్డు వైసీపీ ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు, తది తరులు పాల్గొన్నారు.


Comments