top of page

కొనిరెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిమజ్జనోత్సవం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 22, 2023
  • 1 min read

కొనిరెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిమజ్జనోత్సవం

నిమజ్జోత్సవంలో పాల్గొన్న సర్పంచ్ కొనిరెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ, కానపల్లే గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామి వారికి కొనిరెడ్డి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం ప్రారంభించారు. చిన్నారుల కోలాటం, చెక్కభజన, పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఆ గణనాథుని ఊరేగింపుగా నిమజ్జనానికి బయలుదేరింది. చెక్కభజన బృందానికి మాస్టర్లు చిరంజీవి, అభి, సన్నీ నేతృత్వం వహించగా భజనలు చూపరులను ఆకట్టుకున్నాయి. లింగాపురం కోలాటం చిన్నారులను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగింది. కార్యక్రమంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, 13 వ వార్డు మెంబర్ హర్షవర్ధన్ రెడ్డి, పలువురు వైసిపి నాయకులు, గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page