top of page

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Oct 2
1 min read

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం మరియు గాంధీ పార్కులలో కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సత్యం మరియు అహింసలను ఆయుధాలుగా మలచుకుని శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు; ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ సంక్షేమ విధానాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా హాజరైన ఏపీఎన్జీవో ప్రొద్దుటూరు అధ్యక్షులు రామసుబ్బయ్య మాట్లాడుతూ పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాజేష్, యశోద, అసిస్టెంట్ ఇంజనీర్లు సురేంద్ర, దస్తగిరి, శానిటేషన్ సూపర్‌వైజర్ నూర్ బాషా తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page