ఆడంబరాలు వద్దు విరాళాలు ఇవ్వండి - జనసేన
- VOICE OF HERALD

- Aug 24, 2023
- 1 min read
ఆడంబరాలు వద్దు విరాళాలు ఇవ్వండి - జనసేన


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధా చేయకుండా పార్టీ బలోపేతానికి తమ వంతు సహాయంగా ఒక రోజు వేతనాన్ని పార్టీకి విరాళాలు ఇవ్వండి అంటూ జనసేన క్రియాశీలక సభ్యులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, పార్టీ సానుభూతిపరులకు కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ ఎన్. జిలాన్ భాష పిలుపునిచ్చారు. సెప్టెంబర్ రెండో తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఫ్లెక్సీల ఏర్పాటు చేసి పాలాభిషేకాలు టపాసులు పేలుస్తూ హంగామా చేసి ధనాన్ని వృధా చేయవద్దని ఆ ధనాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చి జనసేన చేస్తున్న పార్టీ కార్యక్రమాలకు దోహదపడవలసిందిగా, విరాళాలు పంపదలచిన వారు 7288040505 నంబర్ పై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా పంపి వారి యొక్క సెల్ఫీ ఫోటోను 9kapublictalk@gmail.com ఈమెయిల్ ఐడీకి పంపి పార్టీ బలోపేతానికి కృషి చేయగలరని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ మెంబర్ ఎం. సంజీవ్, జన సైనికులు ఆర్. ప్రసాద్, జి. వినోద్, లక్ష్మణ్, ఓబులేసు, సోయబ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.






Comments