top of page

ఉచిత రక్త నమూనా పరీక్షలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 22, 2023
  • 1 min read

ఉచిత రక్త నమూనా పరీక్షలు

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ఆదరణ సేవా సమితి, కీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని, స్థానిక శివాలయం కూడలి వద్ద ఉచిత రక్త నమూనా పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కీర్తన సేవా సమితి అధ్యక్షుడు ఎం. రాజు (జీ తెలుగు విలేకరి) మాట్లాడుతూ తాము గత మూడు సంవత్సరాలుగా ప్రజలకు ఉచిత రక్త నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇందువలన రానున్న రోజుల్లో రోగులకు, క్షతగాత్రులకు అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేయటానికి అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొని వారి రక్త నమూనాలు తెలుసుకొని, కార్యక్రమ నిర్వాకులకు కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమంలో ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు బైసాని సత్యనారాయణ, సంస్థ సభ్యులు సంస్థ సభ్యులు శంకర్ ఆచారి, మాధవ, రవి, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page