సబ్ రిజస్ట్రార్ పై మాజీ ఎమ్మెల్యే వరద ఫైర్
- VOICE OF HERALD

- Aug 7, 2023
- 1 min read
సబ్ రిజస్ట్రార్ రామ లక్ష్మి పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫైర్

ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయం అంతా అవినీతి మయం గా ఉందంటూ ప్రొద్దుటూరు సబ్ రిజస్ట్రార్ రామ లక్ష్మి పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రొద్దుటూరు లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూముల రిజస్ట్రేషన్ కు వస్తె ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వద్దకు వెళ్లి కలవమని సబ్ రిజిస్ట్రార్ రామలక్ష్మి చెబుతున్నారని... అసలు ఎమ్మెల్యే దగ్గరకు ఎందుకు వెళ్ళాలని వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు తమ సొంత ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు చేసుకుంటుంటే మద్యలో ఎమ్మెల్యే కు ఎందుకు కప్పం కట్టలని అన్నారు. అవినీతి మార్గాలలో డబ్బు సంపాదించే వారికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకుంటున్నారని వరదరాజుల రెడ్డి తీవ్ర విమర్శిలు చేశారు.




Comments