top of page

వివేకానంద కాలనీలో అగ్ని ప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 14, 2023
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


వివేకానంద కాలనీలో అగ్నిప్రమాదం


బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి


తన వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తానని బాధితులకు హామీ - కొనిరెడ్డి

శనివరం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీ రామాలయం వద్ద నిప్పు అంటుకొని రేకుల ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి. సకాలంలో సంఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. కాగా స్థానికుల ప్రాధమిక సమాచారం ప్రకారం తల్లిదండ్రులు తమ కొడుకుకు చరవాణి కొనివ్వలేదని ఇంటి లోని బట్టలకు నిప్పు పెట్టినట్లు చెబుతున్న స్థానికులు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి బాధితులను పరామర్శించి వారికి తనవంతుగా ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితురాలు సరస్వతి మాట్లాడుతూ ఇంటి పెద్దను కోల్పోయి తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న తమకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిన కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page