top of page

ప్రశ్నార్థక ఫ్లెక్సీ కి అర్ధం దొరికింది.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Feb 28, 2024
  • 1 min read

ప్రశ్నార్థక ఫ్లెక్సీ కి అర్ధం దొరికింది.

జిల్లా వ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేసిన ప్రశ్నార్థక ప్లెక్సీ "అరెత్తాయ్....ఇట్నే సూచ్చువుండు" అన్న ప్రశ్నకు అర్థం దొరికింది.

ఇది ఒక అగ్రికల్చర్ మార్కెటింగ్ సీడ్స్ కంపెనీకి చెందినది. ప్రచార నిమిత్తం అందరినీ ఆలోచింపజేసేదిగా ప్రకటనతో ఈ కంపెనీ సరికొత్త పంథా ను ఎంచుకుంది.త్వరలో తమ వ్యాపారాన్ని కొనసాగించుకున్న ఈ కంపెనీ ఆరోజున ప్రస్తుత ఫ్లెక్సీ స్థానంలో వారి కంపెనీ లోగో తో రెండవ బ్యానర్, పేరు అడ్రస్సు వివరాలతో మూడవ ఫ్లెక్సీ నీ ముద్రిస్తారని సమాచారం.ఇది వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటన మాత్రమే.

కాగా ఇదివరకే పట్టణాలలో ఏర్పాటు అయిన ఈ ఫ్లెక్సీ స్థానంలో రెండవ దశగా " నీ కోసమే వచ్చండబ్బా".... అంటూ బ్యానర్ ఏర్పాటు కావడంతో ప్రశ్నార్థకంగా మారిన ఈ ప్లెక్సీ కి సమాధానం దొరికినట్లయింది. మన చిట్వేలి లో కూడా త్వరలోనే రెండో బ్యానర్ వెలసనుంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page