top of page

పారిశుద్ధ్యం పై కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 24
1 min read

పారిశుధ్యంపై కమీషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

నగరంలో వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అధికారుల బృందంతో కలిసి పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని డ్రైన్ల ద్వారా యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయించడంతో పాటు, సులభ్ కాంప్లెక్స్‌లను తనిఖీ చేసి యాత్రికుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. అలాగే దుకాణాల్లో ప్లాస్టిక్ నిషేధం, పారిశుధ్య నిర్వహణపై వ్యాపారులకు కీలక సూచనలు చేశారు. బస్టాండ్ పరిసరాల్లో వేలాది టైర్లలో నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించి, మాలథియాన్ స్ప్రే చేయాలని శానిటేషన్ సూపర్‌వైజర్ నూర్ బాషాను ఆదేశించారు.

దోమల వ్యాప్తి నివారణకు రాబోయే రెండు రోజులు నగరవ్యాప్తంగా ముమ్మరంగా ఫాగ్గింగ్ చేపట్టాలని, నిల్వ ఉంచిన మాంసం, చేపలు, ఆహార విక్రయాలపై కఠిన నిఘా ఉంచాలని పబ్లిక్ హెల్త్ అధికారులను కమీషనర్ ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామని, వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page