top of page

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఇద్దరు క్రీడాకారులు ఎంపిక

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 9, 2023
  • 1 min read

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఇద్దరు క్రీడాకారులు ఎంపిక

పెన్సింగ్ ను ప్రారంభిస్తున్న ప్రతినిధులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఇద్దరు క్రీడాకారులు ఎంపికైనట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.చంద్ర కళావతి తెలియజేశారు.గురువారం స్థానిక క్రీడా వికాసం నందు జిల్లా సీనియర్ జట్టు ఫెన్సింగ్ ఎంపికలు నిర్వహించారు. ఇందులో మద్దూరి సురేష్, కంతూరి లోకేష్ రాయల్ లు ఎంపికయ్యారని.. వీరు ఈనెల 10, 11 వ తేదీలలో కాకినాడలోని ద్రోణ అకాడమీ నందు రాష్ట్ర స్థాయి పోటీలలో పెన్సింగ్ ఫాయిల్ విభాగంలో పాల్గొంటారని చంద్ర కళావతి తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవికె శాప్ కోచ్ హరికృష్ణం రాజు,ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మురళీకృష్ణ రెడ్డి, ఫెన్సింగ్ సంఘం ప్రతినిధి ఏ.రామాంజనేయులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page