top of page

రాచమల్లు అసత్య ఆరోపణలు మానుకోవాలి: మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి ఆగ్రహం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 7
1 min read

రాచమల్లు అసత్య ఆరోపణలు మానుకోవాలి: మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి ఆగ్రహం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు, స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరినీ గౌరవించే వ్యక్తినని, ఏనాడూ ఎవరినీ అమర్యాదగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. చేనేత కార్మికులపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రాచమల్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయన ఆరోపణల్లో వాస్తవం ఉంటే చౌడేశ్వరి అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బీసీల ఓట్లు దూరమవుతాయన్న భయంతోనే తనతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై రాచమల్లు బురదజల్లుతున్నారని ఆరోపించారు. తాను మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేయడం లేదని, తనపై చేస్తున్న విమర్శలు కేవలం పాత నేరాలు, హత్యారోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని స్పష్టం చేస్తూ, రాచమల్లు ఇప్పటికైనా హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.


అనంతరం నాయకులు రాజువారి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, చెన్నమరాజుపల్లెలో గతంలో కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు జరిగిన మాట వాస్తవమే అయినా, ప్రస్తుతం రెండు కుటుంబాలూ సామరస్యంగా ఉంటూ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నాయని తెలిపారు. గత పరిణామాల వెనుక ఉన్న వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ ఇంచార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page