top of page

ప్రవీణ్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 25, 2022
  • 1 min read

ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి జి.ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన కమలాపురం మాజీ శాసనసభ్యులు జి.వీర శివారెడ్డి

పొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని అక్రమ అరెస్టు భాగంగా, కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాల వీరశివా రెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో కడప సబ్ జైల్ వద్దకు చేరుకొని ప్రవీణ్ కుమార్ రెడ్డి ని పరామర్శించారు. జి వీరశివా రెడ్డి వారి కుటుంబం పాటు పొద్దుటూరు టిడిపి ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి సతీమణి వారి కుటుంబ సభ్యులు పరామర్శించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మాజీ శాసన సభ్యులు వీరశివా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అందులో భాగంగా ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని ఆయన తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page