top of page

వరదకు టిడిపి టికెట్ ఖరారు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Mar 14, 2024
1 min read

మాజీ ఎమ్మెల్యే వరదకు టిడిపి టికెట్ ఖరారు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


గురువారం టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 34 నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన నేపథ్యంలో, కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టిడిపి కి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు పెద్దాయనగా పిలవబడే నంద్యాల వరదరాజుల రెడ్డి పేరును ఖరారు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వరదకు టికెట్ ఖరారు అయిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున నెహ్రూ రోడ్డులోని ఆయన కార్యాలయం వద్దకు చేరుకొని ఆయనను అభినందనలతో ముంచెత్తారు. ఆయనను సన్మానించి కాబోయే ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అంటూ కొనియాడారు. అనంతరం సంబరాలు జరుపుకున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ టిడిపి నాయకులు కూడా వరద గెలుపుకు సహకరిస్తారని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డికి టికెట్ ఖరారు అవ్వడంతో వైసీపీ నాయకులు ముఖ్య కార్యకర్తలలో ఒకింత కలవరం మొదలైంది. టిడిపి బిజెపి జనసేన పొత్తు ధర్మంలో భాగంగా నాయకులు కార్యకర్తలు గట్టిగా కృషి చేస్తే ప్రొద్దుటూరులో టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి గెలుపు కష్టమేమీ కాదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page