top of page

ప్రజలు తిరుగుబాటు చేయవలసింది అధికారులపై కాదు కూటమి నాయకులపై - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 30
  • 1 min read

ప్రజలు తిరుగుబాటు చేయవలసింది అధికారులపై కాదు కూటమి నాయకులపై - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రంలో గడచిన రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనపై బుధవారం ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపే అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచార నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అవినీతిపై ఉక్కు పాదం మోపుతామని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే వరద నేడు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపటం పట్ల వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎమ్మెల్యే వరద ఎత్తిచూపటం అభినందించదగ్గ విషయమని అన్నారు. అవినీతిపరులంటూ అధికారులపై నిందలు వేయటం తగదని, కూటమి ప్రభుత్వంలో అందున ప్రొద్దుటూరులో ప్రస్తుతం అవినీతి జరగటం లేదా నాయకులు అవినీతికి పాల్పడటం లేదా అని సూటిగా ప్రశ్నించారు? అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేయమని సాక్షాత్తు ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సబబేనా అంటూ, ప్రజలు తిరుగుబాటు చేయవలసింది అధికారుల పైన కాదని కూటమి ఎమ్మెల్యేలపై అని రాచమల్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకున్న ఎమ్మెల్యే వరద రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నిస్తూ? తాజాగా ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ బాబు ఎమ్మెల్యే వరదను సూక్ష్మంగా మందలించినట్లు ఇది జీర్ణించుకోలేని ఆయన కూటమి ప్రభుత్వంపై అధికారులపై అవినీతి ఆరోపణ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తాము భావిస్తున్నామని తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page