పేదవారి డాక్టర్ కలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
- EDITOR

- Dec 9, 2025
- 1 min read
Updated: Dec 10, 2025
పేదవారి డాక్టర్ కలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే పేదవారి డాక్టర్ కల దూరమవుతుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాలనలో ఫీజులు పెరిగిపోగా, వైద్యం కూడా లాభాల వ్యాపారమవుతుందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలు దెబ్బతినే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే చరిత్రలో తప్పు నిర్ణయం తీసుకున్న నేతలుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనే ప్రయత్నాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఎద్దేవా చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల కలలైన డాక్టర్ అవ్వాలనే అవకాశాన్ని దూరం చేసే నిర్ణయం ఇది అని ప్రభుత్వ ఆలోచన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాలనలో మెడికల్ విద్య ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో చికిత్స సాధారణ ప్రజలకు అందని ఖర్చుతో కూడుకున్న వైద్యంలా ఉంటుందని తక్కువ సిబ్బంది, ఎక్కువ ఫీజులతో వ్యాపార ధోరణి పెరిగి విద్య, వైద్యం లాభాల వ్యాపారంగా మారిపోతుందని విమర్శించారు. ప్రభుత్వం నడిపే మెడికల్ కాలేజీల వల్లే పేదలు కూడా డాక్టర్లు అవుతున్నారు. ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటులకు అప్పగిస్తే పేదవారి కలలు కలలుగానే మిగిలిపోతాయి అని శివప్రసాద్ రెడ్డి అన్నారు.
దేశంలో జరుగుతున్న విమాన సమస్యలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ బాధ్యతాయుతమైన పరిపాలన ఎలా ఉండాలో లాల్‌బహదూర్ శాస్త్రి వంటి మహానుభావుల నుంచి నేర్చుకోవాలని సూచించారు. తప్పిదం జరిగితే నైతిక బాధ్యత వహించే నేతలు ఈ దేశానికి అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలపై ప్రభావం చూపే ప్రతి నిర్ణయం గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు చేతుల్లో పెట్టడం వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని అర్థం చేసుకొని సీఎం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని అన్నారు. లేదంటే చరిత్రలో తప్పు నిర్ణయాలు తీసుకున్న నేతగా నిలిచిపోతారని హెచ్చరించారు.





Comments