top of page

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే - వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 3, 2024
  • 1 min read

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే - వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా, ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా, సీనియర్ నేతగా పార్టీకి ఎంతో కృషి చేసిన నాకు తప్ప టికెట్ అడిగే అర్హత, పొందే అర్హత ఎవరికి లేదంటూ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో టిడిపి అభ్యర్థి తానేనంటూ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి వాల్ పోస్టర్లు వేయడం సరైన చర్య కాదని లింగారెడ్డి అన్నారు. ఎవరికి వారు పోస్టర్లు వేసుకుంటూ పోతుంటే క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ రాహిత్యం కిందికి వస్తుందని లింగారెడ్డి హెచ్చరించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి కి ఇంకా పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయలేదని, గోడపత్రికలు కూడా ఆయన వ్యక్తిగతంగా వేసుకున్నవేనని జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు టికెట్ బహునాయకత్వం ఉన్న ప్రొద్దుటూరు లో ఇలా పోస్టర్లు వేయడం వలన ప్రజలు, కార్యకార్తలు అయోమయంకు గురయ్యే పరిస్థితి ఉందని అన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page