top of page

పవన్ కళ్యాణ్‌కు చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 15, 2023
  • 1 min read

పవన్ కళ్యాణ్‌కు చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని. "నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే... నేను రెండు చెప్పులు చూపిస్తా...


మాకు లేవా చెప్పులు" అంటూ పేర్ని నాని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. నిన్న కత్తిపూడిలో.. వారాహి యాత్ర చేపట్టి... వాహనం పై నుంచి ప్రసంగించిన పవన్ కళ్యాణ్... ఆ సందర్భంగా... వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ... గంటకు పైగా ప్రసంగించారు. ఆ వ్యాఖ్యలకు తాజాగా మంత్రి పేర్ని నానీ కౌంటర్స్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌ గత వీడియోలను ప్లే చేసిన పేర్ని నానీ.. వాటిలో ఆయన మాట్లాడిన మాటలకూ... నిన్న చేసిన ప్రసంగానికీ పోలిక చూపిస్తూ... మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలని కోరారు. పవన్ కళ్యాణ్ పరిస్థితులకు అనుగుణంగా తన కులాన్ని మార్చేస్తారనీ... తగిన ఓట్లు వచ్చే ఛాన్స్ లేకపోయినా... సీఎం అయిపోవాలని కలలు కంటున్నారని విమర్శలు చేశారు. అన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నానీ మండిపడ్డారు..

పవన్ కళ్యాణ్‌ గత వీడియోలను ప్లే చేసిన పేర్ని నానీ.. వాటిలో ఆయన మాట్లాడిన మాటలకూ... నిన్న చేసిన ప్రసంగానికీ పోలిక చూపిస్తూ... మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలని కోరారు. పవన్ కళ్యాణ్ పరిస్థితులకు అనుగుణంగా తన కులాన్ని మార్చేస్తారనీ... తగిన ఓట్లు వచ్చే ఛాన్స్ లేకపోయినా... సీఎం అయిపోవాలని కలలు కంటున్నారని విమర్శలు చేశారు. అన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నానీ మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రసంగించినా... కచ్చితంగా వైసీపీ నేతల నుంచి కౌంటర్స్ రావడం కామన్. ఇప్పుడు పేర్ని నానీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆయన.. ఓ అడుగు ముందుకు వేసి ప్రెస్ మీట్‌లో 2 చెప్పులూ తీసి మరీ చూపిస్తూ వాయిస్తానని వార్నింగ్ ఇవ్వడం రాజకీయ ఉద్రిక్త పరిస్థితిని వెల్లడిస్తోంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page