top of page

ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా బాబు ను అరెస్టు చేశారు - మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 15, 2023
  • 1 min read

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


గవర్నర్ అనుమతి లేకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి పెద్ద తప్పు చేశారనీ బిజెపి నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. హత్య కేసులో 8వ ముద్దాయిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన సిబిఐ అధికారులను ఏ విధంగా వైసీపీ నేతలు అడ్డుకున్నారో ప్రజలందరికీ తెలుసని, విజయసాయిరెడ్డి అల్లుడు లిక్కర్ స్కాంలో ప్రధాన ముద్దాయి అని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్కాం ఏదైనా ఉందంటే అది లిక్కర్ స్కాం అని, సీసాలలో నాటు సారాయి పోసి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమే అమ్ముతూ ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మాజీ మంత్రి విమర్శించారు. అమరావతి రాజధాని కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్న అవేవీ లెక్కచేయకుండా వైసీపీ మంత్రులు విశాఖకు రాజధానికి తరలిస్తున్నామని బాహాటంగా చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. బిజెపి అధిష్టానం వైసిపిని దూరంగా పెడుతుంది అంటే వచ్చే ఎన్నికల్లో టిడిపికి దగ్గరవుతుందని , అందుకు నిదర్శనంగానే ఇటీవల ఏపీ, తెలంగాణ బిజెపి అధ్యక్షులను, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు లతో అమిత్ షా మాట్లాడటం చూస్తే బాహాటంగానే టిడిపి తో బిజెపి కలవబోతుందని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page