top of page

టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 25, 2024
  • 1 min read

టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


తాజా పరిణామాలతో ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి జోష్ అందుకుంది. శనివారం 19వ వార్డు వైసిపి కౌన్సిలర్ షేక్ మునీర్ టిడిపిలో చేరగా, ఆదివారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గంజికుంట ఆంజనేయులు ఆయన సతీమణి గంజికుంట కృష్ణవేణి రాష్ట్ర టిడిపి నాయకులు సీఎం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుండి గంజికుంట ఆంజనేయులు కౌన్సిలర్ గా గెలుపొందగా, 2014 మునిసిపల్ ఎన్నికలలో ఆయన సతీమణి గంజికుంట కృష్ణవేణి వైసిపి నుండి కౌన్సిలర్ గా గెలుపొందారు. బీసీ సామాజిక వర్గం నుండి ఇక్కడి వార్డులలో అంజి ఆయన కుటుంబానికి మంచి పట్టు ఉండటం వలన ఇది టిడిపికి కలిసి వచ్చే అవకాశం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్, మాజీ పట్టణ అధ్యక్షులు పీవీ సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు నల్లపోతుల నాగరాజు, 19వ వార్డు కౌన్సిలర్ మునీర్, చిన్నశెట్టి పల్లె ప్రభాకర్ రెడ్డి, పలువురు టిడిపి నాయకులు, వార్డులోని మాజీ కౌన్సిలర్ అంజి అనుచరులు, వార్డులోని ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page