ప్రొద్దుటూరులో పేదల ఇళ్ల స్థలాల ఆక్రమణ: న్యాయం చేయాలని బాధితుడి ఆవేదన

ప్రొద్దుటూరులో పేదల ఇళ్ల స్థలాల ఆక్రమణ: న్యాయం చేయాలని బాధితుడి ఆవేదన

కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్, గోకుల్ నగర్‌కు చెందిన రాచగోళ్ల సుబ్బరాయుడు (తండ్రి: లేట్ రాచగోళ్ల వెంకట సుబ్బయ్య) తనకు న్యాయం చేయాలంటూ మీడియా ద్వారా తన గోడును వెళ్లబోసుకున్నారు. ప్రొద్దుటూరు పల్లె గ్రామ పొలంలోని పాత అమృత నగర్‌లో 2002 నవంబర్ 29న అప్పటి తహశీల్దార్ జి. వెంకట సుబ్బయ్య అనుమతితో తమ కుటుంబ సభ్యులకు (కోడూరు వెంకటేశు, దాదిబోయిన వీరమ్మ, మెర్క లక్ష్మీ దేవి) ప్రభుత్వం డి-ఫారమ్ పట్టాలను మంజూరు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో సహా నివసిస్తుండగా, ప్రొద్దుటూరు టౌన్ నడింపల్లెకు చెందిన పసుపులేటి కవిత, మైల్గాని అంకమ్మ, మైల్గాని గంగాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు తమపై దాడి చేసి, సామాన్లు బయట పారేసి, బండలు పగలగొట్టి దౌర్జన్యంగా ఇళ్లను ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈ అక్రమ ఆక్రమణపై స్థానిక రూరల్ పోలీసులు, తహశీల్దార్, కడప జిల్లా కలెక్టర్, జమ్మలమడుగు ఆర్డీవోలకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని ఆయన తెలిపారు. 33 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్న తాను, బొల్లవరం బైపాస్ రోడ్డు వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విన్నవించగా, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ 2002 నుండి 2026 వరకు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పరిష్కారం దక్కకపోవడంతో గత్యంతరం లేక మీడియాను ఆశ్రయించానని, పత్రికలు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తన సమస్యను వెలుగులోకి తెచ్చి న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.






Comments