top of page

ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 29, 2023
  • 1 min read

ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు

రాజంపేట


ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మే ఒకటవ తేదీ నుంచి నిర్వహించనున్న మెగా సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అకాడమీ గ్రాండ్ మాస్టర్ సునీల్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు జీఎంసీ క్లబ్ ఆవరణలో మార్షల్ ఆర్ట్స్ నందు శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. టైక్వాండో, కుంగ్ ఫు, సిలబం ( కర్ర సాము ) లలో నిష్ణాతులైన, అనుభవం గల మాస్టర్లచే శిక్షణ ఇవ్వబడుతుందని., ఈ మెగా సమ్మర్ క్యాంపును ఆసక్తిగల యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరములకు 9052794890, 9440500042 నంబర్లను చరవాణి ద్వారా సంప్రదించాలని కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page