top of page

ఘనంగా 74 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 26, 2023
  • 1 min read

ఘనంగా 74 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని, మేధో మధనం చేసి, నైతిక విలువలు కలిగి, ధర్మబద్ధమైన, నీతి బద్దమైన జీవన విధానాలను మార్గదర్శకాలుగా అవలంబించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనేక దేశాలను పర్యటించి అక్కడి విధివిధానాలతో భారతదేశంలో ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని, హక్కులను రూపొందించి ప్రజలు బాధ్యత నిర్వర్తించేలా రాజ్యాంగబద్దమైన అంశాలను దేశానికి అందించారని, అట్టి మహానుభావునికి తాను ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page