top of page

ప్రొద్దుటూరు దస్తగిరిపేటలో డబల్ మర్డర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 21, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరులో దంపతుల దారుణ హత్యతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, స్వయానా సోదరుడు ఈ హత్యా చేయటం బంధాలను మానవతా విలువలను ప్రశ్నిస్తోంది. పుడుతూ అన్నదమ్ములు పెరుగుతూ దాయాదులు అన్న సామెతకు నిలువెత్తు సాక్షం ఈ సంఘటన. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు దస్తగిరిపేట లో నివాసం ఉంటూ హత్యకు గురయిన దంపతులు నీలాకరం మోషే (60) సరోజమ్మ (55) గా గుర్తింపు. పట్టపగలే రాడ్డుతో బలంగా కొట్టి దంపతులను హత్య చేసిన మోషే సోదరుడు యేసయ్య, భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్తి తగాదలతోనే హత్య జరిగినట్టు స్థానికుల కథనం. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు, హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page