top of page

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 23, 2023
  • 1 min read

శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

ఆదివారం ఆర్టీపీలోని చౌడేశ్వరి గుడి దగ్గర రాజశేఖర్ కుమారుడు వశిష్ట పుట్టినరోజు సందర్భంగా మిగిలి ఉన్న బిర్యానీ రైస్ 300 మందికి ఉందని శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు అందరికీ సుపరిచితుడు స్నేహశీలి రాజు ఫోన్ చేసి తెలియజేయగా, బిర్యానీ రైస్ కలెక్ట్ చేసుకుని ఆర్టిపిపి కృష్ణానగర్ లోని రాముల వారి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎంత కష్టం అయినా ఆహారాన్ని సేకరించి ఆకలి తో ఉన్న వాళ్ళకు అందించి ఆకలి తీర్చడమే డొక్కా సీతమ్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ లక్చ్యం అని జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యుడు ఆది నారాయణ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ జమ్మలమడుగు ప్రెసిడెంట్ ఆదినారాయణ, ప్రభాకర్, ఇంద్ర, రవి, అశోక్, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page