top of page

అత్యాచార చట్టాలు మరింత ఖటినతరం చేయాలి - వైద్యుల నిరసన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 17, 2024
  • 1 min read

అత్యాచార చట్టాలు ఖటినతరం చేయాలి


దోషులు ఎంతటివరైనా కఠినంగా శిక్షించాలి


- వైద్యుల నిరసన

నిరసన తెలుపుతున్న ప్రొద్దుటూరు వైద్యులు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా, ప్రొద్దుటూరు ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు ఈరోజు తమ ఓపి సేవలు నిలిపివేసి జమ్మలమడుగు రోడ్డులోని ఐఎంఏ కార్యాలయం వద్ద నుండి శివాలయం కూడలి వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. కలకత్తాలో వైద్యురాలిని అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం శివాలయం సెంటర్ వద్ద మృతి చెందిన వైద్యురాలికి నివాళి అర్పించారు. ర్యాలీలో ప్రొద్దుటూరు వైద్యులు, వారికి సంఘీభావంగా ర్యాలీలో ఫీషియో థెరఫీ, హోమియో, డెంటల్ వైద్యులు, మెడికల్ రెప్రజెంట్ లు తదితరులు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page