top of page

ఇరుగు పొరుగు జిల్లాల SP లు భార్యాభర్తలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 3, 2022
  • 1 min read

భార్య ఇప్పటికే జిల్లా ఎస్పీగా ఉండగా భర్త కూడా తాజాగా పొరుగునే ఉన్న జిల్లా ఎస్పీగా పోస్టింగ్ పొందారు. మల్లిక గార్గ్ దంపతులకు ఈ విధంగా ఉగాది కానుక లభించినట్లయింది. ఏడాది కాలంగా మలిక గార్గ్ ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న విషయం తెలిసిందే. సమర్ధురాలైన అధికారిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.

ఇక తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా బాపట్ల జిల్లా ఆవిర్భవించింది.ఈ జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్ భర్త వకుల్ జిందాల్ నియమితులయ్యారు.ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా ఆదివారం జారీ అయ్యాయి. ఇప్పటి వరకు జిందాల్ సీఎంఓ కార్యాలయంలో సెక్యూరిటి అధికారిగా ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page