top of page

గణేష్ ఉత్సవాల్లో అపశృతి.

Writer: DORA SWAMY
DORA SWAMY
Sep 23, 2023
1 min read

--ప్రాణాల మీదికి తెస్తున్న ఫీట్లు.

---కుటుంబానికి వేదన మిగులుస్తున్న యువత.

అందరికంటే ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనో, లేక అందరినీ ఆకట్టుకోవాలన్న అమాయకత్వమో తెలియదు కానీ.. తెలిసి తెలియక చేసే తప్పులు వల్ల యువత కుటుంబానికి వేదన మిగులుస్తున్నారు. వివరాల్లోకెళితే శనివారం రాజంపేట గణేష్ నిమజ్జనాలలో భాగంగా ఓ యువకుడు చేసిన సాహసం ప్రాణాల మీదికి తెచ్చింది. నిలిచి ఉన్న ట్రాక్టర్ ముందర బంపర్ మీద నుంచి పల్టి వేసేందుకై రోడ్డుపై దూకడంతో పట్టుతప్పి తల పైభాగం బలంగా రోడ్డుకు తాకి బలమైన గాయంతో కదలని స్థితిలో పడిపోయాడు.

ఇబ్బంది జరుగుతుందని తెలిసి చుట్టూ ఉన్న యువత నివారించకపోవడం పైగా వీడియోలు కవర్ చేయడం పై సర్వత్ర విమర్శలు వినబడుతున్నాయి. దేవుని కార్యం పేరుతో తెలిసి తెలియని ఫీట్లతో ప్రాణాలు పైకి తెచ్చుకుంటున్న వ్యక్తులు ఇట్టి సాహసాలు చేసే ముందు తమ కుటుంబ సభ్యుల సౌఖ్యం గూర్చి, ఎదురయ్య ఇబ్బందులను గూర్చి ఒక్కసారి ఆలోచించాలని నెటిజల్లు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page