ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి - సిపిఐ
- VOICE OF HERALD

- 3 days ago
- 1 min read
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి - సిపిఐ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులకు మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ CPI, AISF పట్టణ సమితుల ఆధ్వర్యంలో నేడు స్థానిక విజయకుమార్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య, పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు, AISF పట్టణ కార్యదర్శి బి పీటర్ లు మాట్లాడుతూ, 22 లక్షల మంది నీట్ పరీక్షలు వ్రాసే విద్యార్థుల భవిష్యత్ ను కోచింగ్ సెంటర్లకు పేపర్ లీకేజ్ చేసి బీజేపీ బలి తీసుకుంటున్నదన్నారు. 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతగా రాజీనామా చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. 27 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ డిల్లీ రాజధానిలో నిరసనలు చేసుంటే వారికి మద్దతుగా మెగసేసే అవార్డు గ్రహీత సోనమ్ ఆమరణ దీక్ష చేపడుతుంటే ప్రధాని మోదీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చే రాజీనామా చేయకపోవడం వెనుక బీజేపీకి కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు ఇస్తున్న తాయిలాలే కారణమన్నారు. ప్రధాని మౌన ముని పాత్ర పోషిస్తున్నాడు కాబట్టే చలో పార్లమెంట్ కు కాక్రోచులు పిలుపిచ్చాయని ఐతే చర్చలతో సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినట్లే ఆహ్వానించి చిలలు కొట్టిన లాఠీల విద్యార్థులను రక్తమొచ్చేలా చావబాదారాని, టియర్ గ్యాస్ లతో భయోత్పాదక వాతావరణాన్ని సృష్టించారన్నారు. 180 మంది విద్యార్థులు యువత పోలీసుల లాఠీ చార్జికి రక్తం ధారలతో ఆస్పత్రుల పాలైనా కేంద్రంలోని మోడీకి నిర్మల సీతారామన్ లకు మాతృహృదయేమే లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ వైసిపి జనసేన పార్టీలు కళ్ళుండి కాబోదుల్లాగ వ్యవహరిస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం వీరి చర్యలను గమనిస్తోందన్నారు. ఈ ప్రభుత్వాలు ప్రజా క్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పట్టణంలో తొలుత AISF అధ్వర్యంలో విద్యాసంస్థలను బంద్ నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ పట్టణ నాయకులు ధనిరెడ్డి శివారెడ్డి, అందే వెంకటేశ్, వసంతరావు, వక్కల వెంకట సుబ్బయ్య, అనిమేల దస్తగిరి, రామకృష్ణ, మద్దిలేటి, హరి, యోసోబ్, ప్రమీల, సుజాత, AISF పట్టణ ఉపాధ్యక్షులు నాని, ముస్తఫా, సహాయ కార్యదర్శి తౌసిఫ్ తదితరులు పాల్గొన్నారు.





Comments