top of page

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం - ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 6 days ago
  • 1 min read

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం - ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు


కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల "నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా 11వ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 29వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ చేనేత వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి చేనేత కుటుంబాలకు రూ.25,000 ఆర్థిక సహాయం అందించడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. చేనేత కుటుంబాల ఇళ్లకు వెళ్లి సహాయం వారి ఖాతాల్లో జమైన విషయంపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకున్నామన్నారు.


2 ఏళ్లలో 10కి పైగా సంక్షేమ పథకాల అమలు


గత రెండేళ్లలో నేతన్న నేస్తం, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం-2, ఎన్టీఆర్ భరోసా, ఆటో డ్రైవర్ల సేవలో, అన్నా క్యాంటీన్లు వంటి పథకాల ద్వారా ప్రతి వర్గానికి మేలు జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ ముక్తియార్, ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు *కొండవీటి భావన*తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించడమే "ఇంటింటికీ తెలుగుదేశం" లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page