top of page

సాయి హర్షితకు ఆత్మీయ ఘనసన్మానం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 23, 2023
  • 1 min read

సాయి హర్షితకు ఆత్మీయ ఘనసన్మానం

సాయి హర్షితను సన్మానిస్తున్న సంఘ పెద్దలు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలలో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన వంకం సాయి హర్షితకు బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు శ్రీ చౌడేశ్వరి దేవి తొగుట వీర క్షత్రియ కళ్యాణ మండపం నందు తోగట వీర క్షత్రియ పెద్దలు ఆమెను ఘనంగా శాలువా కప్పి, పూలమాల, జ్ఞాపికతో సన్మానించారు. తొగుటవీర క్షత్రియ కుల పెద్దలు కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా సాయి హర్షిత మాట్లాడుతూ, డిప్యూటీ కలెక్టర్ గా తాను ఎంపికైనందుకు ఆనందంగా ఉందని, తాను ఈ విజయం సాధించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహాయ సహకారాలు ఎన్నటికీ మరువపోనని, తనను సన్మానించిన పెద్దలకు కృతజ్ఞత తెలిపారు. అనంతరం పలువురు పెద్దలు మాట్లాడుతూ, సాయి హర్షిత రాబోవు రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. సాయి హర్షిత ను ఆదర్శంగా తీసుకొని చదువు పట్ల శ్రద్ధ వహించి తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Aug 23, 2023
Rated 5 out of 5 stars.

Great achievement

Like
bottom of page