top of page

విద్యార్థిని అనూష అనుమానస్పద మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 23, 2022
  • 1 min read

విద్యార్థిని అనూష అనుమానస్పద మృతి

కడప జిల్లా, బి.కోడూరు మండలం మరాటి పల్లి గ్రామానికి చెందిన డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని అనూష అనుమానస్పద మృతి. ఇటీవల బద్వేల్ ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతూ ఇంటికి చేరని అనూష. సిద్ధవటం పెన్నా నదిలో శవంగా మారిన విద్యార్థిని అనూష. కళాశాల విద్యార్థులు కొందరు విద్యార్థినిని తీసుకుని వెళ్లి హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. సిద్ధవటం నుంచి విద్యార్థిని మృతదేహం శవ పరీక్ష నిమిత్తం కడప రిమ్స్ పంపించిన పోలీసులు. తమ బిడ్డ ఆచూకీ కనిపించలేదని ఇదివరకే బద్వేలు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న బద్వేలు గ్రామీణ పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page