చావు లోనూ వీడని ప్రేగు బంధం
- DORA SWAMY

- May 7, 2022
- 1 min read
చావు లోనూ వీడని ప్రేగు బంధం - నీటిలో పడ్డ బిడ్డ కాపాడే ప్రయత్నంలో బిడ్డ తల్లి మృతి.

ప్రేగు బంధం అలాంటిది మరి.. తల్లికి బిడ్డ పై ఉన్న ప్రేమ బిడ్డను తల్లి ని ఇరువురిని విగతజీవులుగా మార్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండల పరిధిలోని నగిరి పాడు గ్రామం నందు ఈరోజు మధ్యాహ్న సమయంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
గ్రామంలోని గుంజనేరు సమీపంలో ఉదయం బట్టలు ఉతికే అందుకై వెళ్లిన తల్లి కూతుర్లు విగతజీవులుగా మారారు. తన కుమార్తె చాందిని (13) ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడం తో తల్లి మౌలాని (50) కూతుర్ని కాపాడాలనే ప్రయత్నంలో నీళ్లల్లో దిగి ఇద్దరూ చనిపోయారు. ప్రమాద స్థలంలో ఎవరూ కాపాడేవారు ఇద్దరు మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు తోపాటు చూచిన వారు బోరున విలపించారు.
స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తదుపరి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు తెలియపరిచారు.



Comments