top of page

టిడిపిలో చేరిన శరాబు(పగిడాల) దస్తగిరి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 19, 2024
  • 1 min read

టిడిపిలో చేరిన శరాబు(పగిడాల) దస్తగిరి

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఒకవైపు టిడిపి నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటూ ప్రజల వద్దకు వెళ్లి టిడిపి మేనిఫెస్టో లోని సూపర్ సిక్స్ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థిస్తుండగా మరోవైపు నూతన చేరికలతో టిడిపి నూతన ఉత్సాహంతో జోష్ మీద ఉంది. శుక్రవారం ఉదయం నూర్ భాషా దూదేకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శరాబు(పగిడాల) దస్తగిరి శ్రీనివాస నగర్ లోని తన కార్యాలయంలో ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. గడచిన కొంతకాలంగా వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల వైసిపి పార్టీ వీడి టిడిపిలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు చదిపిరాళ్ల రాంగోపాల్ రెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి వి.ఎస్ ముక్తీయార్, ఈవి సుధాకర్ రెడ్డి, వంగనూరు మురళీధర్ రెడ్డి, పలువురు క్రియాశీలక నేతలు, కార్యకర్తలు, దస్తగిరి అభిమానులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page