top of page

రూపానంద రెడ్డిని కలిసిన చిట్వేలు టిడిపి నాయకులు.

Writer: DORA SWAMY
DORA SWAMY
Nov 11, 2023
1 min read

ముక్కా రూపనంద రెడ్డిని కలసిన చిట్వేలి టిడిపి నాయకులు.

ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న టిడిపి నాయకులు.


ముక్కా ఫౌండేషన్ అధినేత ముక్కారూపానందరెడ్డిని శనివారం ఆయన స్వగృహంలో కలిసి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు చిట్వేలి టిడిపి సీనియర్ నాయకులు కాకర్ల (లారీ) సుబ్బరాయుడు తెలియపరిచారు.


కోడూరు నియోజకవర్గ పరిధిలో ఆపదలో ఉన్న వారికి అడగకుండానే నిరంతరం సహాయం అందించే దయాగుణం ముక్కా రూపానంద రెడ్డి వారి తనయుడు సాయి వికాస్ రెడ్డి దని, వారు వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని లారీ సుబ్బరాయుడు అన్నారు.

ఈ కార్యక్రమంలో చిన్నంపల్లి బ్రహ్మయ్య నాయుడు, పుల్లంపేట నారాయణ నాయుడు, బాలు రెడ్డయ్య, మాచిన హరినాథ్, రాయన సుబ్బారాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page