top of page

కడప జిల్లా డిగ్రీ, పీజీ విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్: పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వరద

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Aug 24
1 min read

కడప జిల్లా డిగ్రీ, పీజీ విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్: పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి

పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక 'క్రికెట్ టోర్నమెంట్-2026'ను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి సారథ్యంలో ఆగస్టు 29, 30, 31 తేదీల్లో ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టోర్నమెంట్ అధికారిక పోస్టర్‌ను నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి, యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ ఆవిష్కరించారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థులలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.


ఈ టోర్నమెంట్‌లో కేవలం 16 జట్లకు మాత్రమే ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సెర్వ్డ్’ ప్రాతిపదికన ప్రవేశం కల్పించనున్నారు. పాల్గొనే జట్లు తమ సంబంధిత కళాశాల పేరుతో పాటు ప్రిన్సిపాల్ లేదా కరస్పాండెంట్ అనుమతి పత్రంతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్ విజేతగా నిలిచిన జట్టుకు రూ.30,000, రన్నరప్ జట్టుకు రూ.20,000 నగదు బహుమతి అందజేయనున్నారు. కడప జిల్లా పరిధిలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఆసక్తి గల జట్లు రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాల కోసం 7893447784, 9581965939, లేదా 6303254192 నంబర్లను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, టీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్ ముఖ్య నాయకులు బచ్చల ప్రతాప్, రసూల్ గౌస్, చేతన్ కుమార్ రెడ్డి, వంశీధర్, శ్రీనివాసులు రెడ్డి, రామాంజనేయులు రెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page