top of page

ఐసీయూ కు వెళ్లి పెన్షన్ అందించిన కౌన్సిలర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2024
  • 1 min read

కౌన్సిలర్ ఆన్ డ్యూటీ - కడప రిమ్స్ హాస్పిటల్ ఐసీయూలో జగనన్న పెన్షన్ అందించిన ప్రొద్దుటూరు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా

పెన్షన్ అందజేస్తున్న కౌన్సిలర్ ఇర్ఫాన్

ప్రొద్దుటూరు: వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు స్థానిక 13వ వార్డు సున్నంబట్టి వీధికి చెందిన ఓ మహిళ.. కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషాకు ఫోన్ చేసి తన తల్లి అనారోగ్య కారణంగా కడప రిమ్స్ లో అడ్నిట్ అయ్యి చికిత్స తీసుకుంటుందని, పెన్షన్ ఎలాగోలా వచ్చే విధంగా చేయాలని కోరింది. కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా వెంటనే స్పందించి వాలంటీర్ ద్వారా స్వయంగా హాస్పిటల్ వెళ్లి నగదు పించను 3000 రూపాయలు అందజేసి ఇది మీ, మన జగనన్న ప్రభుత్వం అమ్మ అని ధైర్యం చెప్పి, ఆరోగ్య శ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ గురించి వివరిస్తూ, తమ ఆరోగ్య వివరాలు తెలుసుకున్న కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష. కుటుంబ సభ్యులు సంతోషంగా కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రిమ్స్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేశ్వర్ రెడ్డిని కలిసి ఆ అవ్వకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page