top of page

నల్లబోతుల నాగరాజును సన్మానించి ఎమ్మెల్యే వరద

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 17, 2024
  • 1 min read

వాల్మీకి కుల బోయ డైరెక్టర్ నాగరాజుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వరద

నాగరాజును సన్మానిస్తున్న ఎమ్మెల్యే వరద

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


వాల్మీకి కుల బోయ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి అందుకున్న నల్లబోతుల నాగరాజుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాలువా, పూలమాలతో సన్మానించారు. స్థానిక టిడిపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నామినేటెడ్ పదవులు రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వటం జరిగిందని, ఇందులో భాగంగా వాల్మీకి కుల బోయ కార్పొరేషన్ డైరెక్టర్ గా నాగరాజును ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరికొన్ని కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు, చైర్మన్ పదవులు ప్రొద్దుటూరుకు ఇవ్వాలని కోరారు. కార్యదక్షత గల నాగరాజు పార్టీ కార్యక్రమాలకు అన్ని వేళలా హాజరై పార్టీ బలోపేతానికి కృషి చేశారని, డైరెక్టర్ స్థాయి నుంచి మరిన్ని ఉన్నత పదవులు నాగరాజు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం సీనియర్ టిడిపి నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, అధినాయకత్వం నాగరాజును గుర్తించి పదవి కట్టబెట్టారని అందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ లకు ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటానని, తాను పార్టీ కోసం కష్టపడిన తీరును గుర్తు చేస్తూ, పదవిని బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page